KMM: తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గుండ్ల నరసింహారావు (35) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం తెల్లవారుజామున గుండెనొప్పితో ఇబ్బంది పడుతున్న నరసింహారావును కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నరసింహారావు ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయల అలుముకున్నాయి.
తెలంగాణ
గుండెపోటుతో యువకుడు మృతి!


