NRPT: నారాయణపేట మండలం కొల్లంపల్లిలో ముస్లిం మత పెద్దలతో రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి శాంతి సమావేశం నిర్వహించారు. బుధవారం జరిగే మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రజల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
మిలాద్ ర్యాలీపై శాంతి సమావేశం


