హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మకు ప్రత్యేక పూజలు

GDWL: జమ్మిచేడు జమ్ములమ్మ దేవాలయంలో శ్రావణ మాసం రెండో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి విశేష అర్చనలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.