హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన కల్వర్టు!

NLG: చింతపల్లి నుంచి మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు ప్రమాదకరంగా మారాయి. మూలమలుపుల వద్ద చెట్లు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డుపై గుంతలతోపాటు కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.