WNP: పట్టణంలోని 9వ వార్డు మర్రికుంటకు చెందిన పోరెడ్డి శాంతమ్మ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని గ్రామీణ ఎస్సై హృషికేశ్ తెలిపారు. ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుమారుడు గోపాల్ రెడ్డి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. శాంతమ్మ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలపాలన్నారు.
తెలంగాణ
వృద్ధురాలు అదృశ్యం.. కేసు నమోదు


