హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో వన మహోత్సవం

MBNR: నేడు జిల్లాలో భారీ స్థాయిలో వన మహోత్సవం నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.