హైదరాబాద్: 28°C
వార్తలు

పాదయాత్ర చేపట్టిన 200 మంది విద్యార్థులు

దాదాపు 200 మంది విద్యార్థులు 25 కిలోమీటర్ల మేర నిరసన బాట పట్టిన ఘటన మధ్యప్రదేశ్ బడ్వానీ జిల్లాలో జరిగింది. ఉపాధ్యాయులు తమను తిడుతున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి ఏకలవ్య ఆదర్శ ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు.