ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ దూరదృష్టితోనే రెండు దేశాల వాణిజ్య బంధం బలపడిందని కొనియాడారు. రెండు దేశాల మధ్య వ్యాపారం వృద్ధి చెందిందని చెప్పారు. ప్రభుత్వ, పార్లమెంటరీ ఆర్థిక రంగాల్లో సహకారం విస్తరించిందని తెలిపారు. గతేడాది ఇరు దేశాల వాణిజ్య టర్నోవర్ తగ్గినప్పటికీ.. మోదీ చొరవ వల్ల ఈ ఏడాది పెరిగిందన్నారు.
వార్తలు
మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం


