హైదరాబాద్: 28°C
వార్తలు

'మెనూ ప్రకారం భోజనం అందించాలి'

పార్వతీపురం మండలం నర్సిపురంలోని బీసీ బాలుర వసతి గృహం, మహాత్మ జ్యోతిబా పూలే బాలికల వసతి గృహాలను రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గదులు, వంటగది, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.