హైదరాబాద్: 28°C
వార్తలు

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం కుడివైపు ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టింది. 160 మంది ప్రయాణికులు ఉన్న ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. భద్రతా తనిఖీల అనంతరం విమానం గంటన్నర ఆలస్యంగా తిరుగు ప్రయాణమైంది.