హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ

BPT: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని చీరాల మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ రంగారావు సూచించారు. ఉప్పుటూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ధారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.