హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్‌ కాంప్లెక్స్‌పై పిచ్చిమొక్కలు

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ కంచరవీధిలోని మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనాలపై పిచ్చిమొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. మొక్కల వేర్లు భవనాలకు నష్టం కలిగించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మొక్కలను తొలగించి భవనాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.