KNRL: సి.బెళగల్‌కు చెందిన మంగమ్మ శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామివారి దేవాలయ అభివృద్ధికి రూ.74,905 విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని దేవస్థానం సిబ్బంది తెలిపారు. విరాళం అందించిన మంగమ్మకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం, బాండ్ పేపర్ అందించి ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించారు.
వార్తలు
ఆలయ అభివృద్ధికి రూ.74,905 విరాళం


