హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ స్కూళ్ల దుస్థితిపై CJP బహిరంగ లేఖ

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విద్యాశాఖ మంత్రులకు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు, కేటాయిస్తున్న నిధులను అధికారికంగా వెల్లడించాలన్నారు. 'మంత్రుల కుక్కలకు ఉన్న సౌకర్యాలు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు లేవు' అంటూ ఘాటుగా విమర్శించారు.