మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' తుది దశకు చేరుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ప్రకటించారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు మూడు మానవరహిత ప్రయోగాలను చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. రాబోయే నాలుగు నెలల్లో తొలి గగన్‌యాన్ మానవరహిత రాకెట్‌ను నింగిలోకి పంపబోతున్నట్లు స్పష్టం చేశారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగుపెడతాడని పేర్కొన్నారు.
వార్తలు
గగన్‌యాన్ అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో


