హైదరాబాద్: 28°C
వార్తలు

లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీం సీరియస్

జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనల్లో మహిళా ఆందోళనకారులపై జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యతగా విచారించాలని సుప్రీంకోర్టు హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఆదేశించింది. త్వరితగతిన మధ్యంతర నివేదికను సమర్పించాల్సిందిగా పేర్కొంది. ఈ విచారణ అత్యంత వేగంగా జరగాలని స్పష్టం చేసింది.