హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా: డీకే అరుణ

TG: జాతీయ స్థాయిలో పదవులు రాకపోవడంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. కొండా సురేఖ చేరికపై తనకు సమాచారం లేదన్న ఆమె, సీఎం రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనను కేవలం పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.