AP: కూటమి ప్రభుత్వ పాలనలో క్రీడలకు స్వర్ణయుగమని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు DSCలో ఉద్యోగాలు ఇస్తే YCP నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. క్రీడాకారులకు జాబ్స్‌లో రిజర్వేషన్ పెడితే YCP దాన్ని కూడా తప్పుపడుతోందన్నారు. వైసీపీకి క్రీడాకారులంటే చిన్నచూపని.. వారి పాలనలో ఆటలను ప్రోత్సహించకుండా అవినీతిపై దృష్టిపెట్టారని ఎద్దేవా చేశారు.
వార్తలు
'క్రీడాకారులకు ఉద్యోగాలిస్తే YCP వద్దంటోంది'


