హైదరాబాద్: 28°C
వార్తలు

దొంగిలించడానికి వెళ్తే.. బురదలో ఇరుక్కుపోయారు!

పంజాబ్‌లోని మోగా జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కోసం వెళ్లిన ముగ్గురు దొంగల ప్లాన్ బెడిసికొట్టింది. వీరు వెళ్లిన కారు, దానిని తీయడానికి తెచ్చిన ట్రక్కు కూడా బురదలో కూరుకుపోయాయి. స్థానికుల అనుమానంతో, దొంగలు పొంతనలేని సమాధానం చెప్పడంతో బండారం బయటపడింది. గ్రామస్థులు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.