హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: లోయ అంచున బస్సు.. తప్పిన ప్రమాదం

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని కన్నడ్ ఘాట్‌లో ఓ బస్సుకు ప్రమాదం తప్పింది. ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొంది. సేఫ్టీ వాల్ అడ్డుగా ఉండటంతో బస్సు లోయ అంచున ఆగిపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు.