ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాకు, ప్రభుత్వానికి, ప్రజలకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'ఉక్రెయిన్ ప్రభుత్వానికి, ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాం' అని జైశంకర్ 'X' వేదికగా స్పందించారు.
వార్తలు
ఉక్రెయిన్‌కు జైశంకర్ శుభాకాంక్షలు


