హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రకృతి ఒడిలో వందేభారత్ రైలు

ప్రకృతి, ఆధునిక సాంకేతికత కలయికకు నిదర్శనంగా నిలిచే ఓ అద్భుత వీడియోను కేంద్ర ప్రభుత్వం పంచుకుంది. దట్టమైన పచ్చని అడవులు, పొగమంచుతో కప్పబడిన కొండల గుండా వందేభారత్ రైలు పాములా వంపులు తిరుగుతూ ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఆకుపచ్చని సముద్రాన్ని తలపించే ప్రకృతి అందాల మధ్య కాషాయ రంగు వందేభారత్ రైలు దూసుకెళ్తున్న వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.