హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు 150 మంది పాక్ వధువులు

భారత యువకులతో నిశ్చితార్థం చేసుకున్న పాక్ సింధీ యువతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆపరేషన్ సింధూర్ కంటే ముందు నిశ్చితార్థం చేసుకున్న 150 మందికిపైగా పాక్ యువతులకు భారత్‌కు వచ్చేందుకు కేంద్రం వీసాలు మంజూరు చేసింది. వీరంతా విమాన మార్గంలోనే రావాలనే షరతుతో వీసాలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 300 మందికిపైగా భారత వీసాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.