హైదరాబాద్: 28°C
వార్తలు

9 మంది మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్

కర్ణాటక తీరంలో ఇంజిన్ మొరాయించి సముద్రంలో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. సముద్రంలో వేటకు వెళ్లిన పడవ ఇంజిన్ అకస్మాత్తుగా విఫలం కావడంతో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ఐసీజీ నౌక గాలింపు చర్యలు చేపట్టింది. బోటును గుర్తించిన సిబ్బంది, అందులోని 9 మంది జాలర్లను క్షేమంగా రక్షించి మంగళూరు ఓల్డ్ పోర్టుకు తీసుకువచ్చారు.