SRD: సంగారెడ్డిలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ కోరింది. వర్షాల వల్ల దోమల ద్వారా డెంగ్యూ, మలేరియాతో పాటు కలుషిత నీటితో టైఫాయిడ్ వ్యాపించే అవకాశం ఉందన్నారు. పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని, క్రమం తప్పకుండా 'డ్రై డే' పాటించాలని సూచించారు. తాగునీటిని కాచి చల్లార్చి తాగాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి


