హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వదేశీ క్రీడా సంస్కృతిని మరింత ప్రోత్సహించాలి'

స్వదేశీ క్రీడా సంస్కృతిని మరింత ప్రోత్సహించాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. అక్టోబరులో అహ్మదాబాద్‌లో బ్రిక్స్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ డెమానస్ట్రేషన్ గేమ్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మేకిన్ ఇండియా, ప్లేఇన్ ఇండియా నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. క్రీడా వస్తువుల తయారీలో భారత్ మెరుగైన వృద్ధి సాధిస్తోందని, క్రీడారంగంలో క్షేత్రస్థాయి సహకారం ఉండాలన్నారు.