మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో నిషేధిత 'థాయ్ మాగూర్' చేపల పెంపకంపై మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వ్యవసాయ కుంటల నుంచి 74 టన్నుల 'థాయ్ మాగూర్' చేపలు స్వాధీనం చేసుకుని వాటిని శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేశారు. వీటిని పెంచుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ చేపల వల్ల స్వదేశీ చేపలు, జలచరాలకు, పర్యావరణ వ్యవస్థకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
'థాయ్ మాగూర్' చేపల పెంపకంపై చర్యలు


