హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ భారీ సంఘీభావ దీక్ష: రామచందర్‌రావు

MDK: రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అన్నారు. బకాయిల విడుదల కోసం ఈ నెల 24, 25 తేదీల్లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 24న మెదక్‌లో నిర్వహించే సంఘీభావ దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ పిలుపునిచ్చారు.