TG: తెలంగాణలో ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈ అర్థరాత్రి నుంచి నిరవధిక బంద్‌కు దిగనున్నారు. 18సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ బంద్‌లో డ్రైవర్ల సంక్షేమ హామీల అమలు ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు అందించాలని కోరుతున్నారు. తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్


