హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్

విజయనగరం జిల్లా ప్రజలకు వేగవంతమైన, పారదర్శక పరిష్కారం అందించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని చెప్పారు. ఆర్జీదారులు పూర్తి సమాచారంతో రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.