VSP: విశాఖపట్నంలో పంచదార ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కిలో రూ.55గా ఉన్న ధర, ప్రస్తుతం ఏకంగా రూ.67కు ఎగబాకింది. దేశవ్యాప్తంగా తగ్గిన ఉత్పత్తి, పండుగల డిమాండే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. నిత్యావసరాల ధరలు ఇలా అకస్మాత్తుగా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను కట్టడి చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా పెరిగిన పంచదార ధర..!


