హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మణేశ్వరంలో 'ఇంటింటికీ టీడీపీ'

ELR: లక్ష్మణేశ్వరం గ్రామంలో ఆదివారం 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికీ కాలినడకన వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేసారు.