SKLM: వంశధార నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో సరుబుజ్జిలి మండలంలోని నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం నదిలో 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.అగ్రహారం, తెలికి పెంట, పాతపాడు గ్రామాల ప్రజలు నది వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


