హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నివాసం ఉన్నచోటే పట్టాల కోసం పోరాటం

VZM: విజయనగరంలో పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే పట్టాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ఎల్‌బీజీ నగర్‌‌లో ఆదివారం సీపీఎం జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల హామీ మేరకు ఇల్లు లేని పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, లేనిపక్షంలో పేదల పోరాటానికి సీపీఎం అండగా నిలుస్తుందన్నారు.