హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సముద్ర తీర ప్రాంత తవ్వకాలతో జిల్లాకు తీవ్ర ముప్పు

శ్రీకాకుళంలో అరుదైన ఖనిజాల పేరుతో సముద్ర తీర ప్రాంతాన్ని తవ్వకాలకు అప్పగించడం వల్ల జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్కలిలోని స్థానిక సీపీఎం కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. తీర ప్రాంతంలో ఖనిజాల కోసం తవ్వకాలు చేపడితే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని అన్నారు.