అన్నమయ్య: చౌడేపల్లె మండలంలోని బోయకొండ కింద భవాని నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 24 మంది జూదరులను అరెస్టు చేశారు. సీఐ సాయిప్రసాద్, ఎస్సై చిన్నరెడ్డెప్పల బృందం 22 మంది పురుషులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుంది. వీరంతా సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.5.03 లక్షలు, 3 కార్లు, 18 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి.. 24 మంది అరెస్ట్


