హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్వహణ కరువై.. పాచి పేరుకుపోయే

KRNL: పెద్దకడబూరులోని జాలవడిలో ప్రజల నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన మినీ నీటి ట్యాంకు నిర్వహణ లేక అధ్వానంగా మారింది. ట్యాంకులో పాచి పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఏళ్లుగా ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో పాచి పేరుకు పోయిన నీటినే వినియోగిస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ట్యాంకును శుభ్రం చేయించాలన్నారు.