హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవత్వాన్ని చాటుకున్న శ్రీధర్ రెడ్డి

SS: పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. స్విమ్మింగ్ పూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపి క్షతగాత్రులను పరామర్శించారు. ఇద్దరు బాధితులను తన వాహనాల్లోనే శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల బంధువులు వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండి ధైర్యం చెప్పారు.