హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్తంభానికి కట్టేసి దాడి.. పెయింటర్‌ మృతి

VSP: కంచరపాలెం రైతుబజార్‌ సమీపంలోని శ్రీనగర్‌కు చెందిన పెయింటర్‌ దమ్ము రాజు(36)పై దాడి జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. పువ్వుల వ్యాపారి సిమ్మ లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు రాజును రోడ్డు పక్కన స్తంభానికి కట్టేసి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెల్లవారుజామున కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ రాజు మృతిచెందాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.