SS: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రకాశం పంతులు త్యాగాలు, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'టంగుటూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి'


