హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్వర్టును ఢీకొన్న లారీ

NLR: మర్రిపాడు మండలం, అచ్చమాంబ గుడి సమీపంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఆదివారం లారీ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన లారీ కల్వర్టు బ్రిడ్జిని ఢీకొనడంతో ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం అనంతరం లారీ హైవేపై నిలిచిపోవడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ప్రమాద సమయంలో ఇటువైపు ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.