హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం పంతులు అడుగుజాడలు ఆదర్శం: కలెక్టర్

అన్నమయ్య: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాలు, ధైర్యసాహసాలు యువతకు ఆదర్శమని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశభక్తి, క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ మంచి పౌరులుగా మెలగాలని కలెక్టర్ కోరారు.