హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాఫర్ డ్యామ్ పటిష్ఠంగా ఉంది: అధికారులు

ELR: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ కుంగిపోయినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు ఖండించారు. ప్రాజెక్టును అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, కాఫర్ డ్యామ్ పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.