WG: తణుకులోని పార్వతీ సమేత స్వామివారికి ఆదివారం 12 కిలోల ఇత్తడి నాగాభరణాన్ని భక్తులు బహుకరించారు. పట్టణానికి చెందిన మహాదశ వీర వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఈ ఆభరణాన్ని అందజేశారు. ఆలయ అర్చకులు అల్లవరపు శంకర శర్మ ద్వారా సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శివాలయానికి 12 కేజీల ఇత్తడి నాగాభరణం


