హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ పంచాయతీలకు ముసాయిదా జాబితా

AKP: నాతవరం మండలంలోని 31 గ్రామపంచాయతీల పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను ఆదివారం మండల పరిషత్ కార్యాలయంతో పాటు ఆయా పంచాయతీల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలను ఈ నెల 26 వరకు స్వీకరిస్తామని ఎంపీడీవో ఎం.ఎస్‌. శ్రీనివాస్ తెలిపారు. 29న కలెక్టర్ ఆమోదానికి పంపి, 31న తుది జాబితా ప్రకటిస్తామన్నారు.