SKLM: రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఆదివారం పలాస టీడీపీ కార్యాలయంలో ఆమె కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి'


