NTR: నందిగామ మండలం ఐతవరంలో ఆదివారం నూతన ముత్యాలమ్మ పోతురాజు దేవస్థానం నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన దేవస్థానం నిర్మాణం త్వరితగతిన పూర్తై ప్రజలకు ఆధ్యాత్మికంగా మరింత ఉపయోగకరంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ముత్యాలమ్మ పోతురాజు దేవస్థానానికి భూమి పూజ


