హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పార్టీ పురోగతిపై నేతల కీలక భేటీ

ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ రెండు ఏళ్ల పాలన, నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై నేతలు సమీక్షించారు.