హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ జిల్లా కార్యాలయ స్థల పరిశీలన

కోనసీమ: అమలాపురంలో నిర్మించనున్న టీడీపీ జిల్లా కార్యాలయ స్థలాన్ని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి ఆదివారం పరిశీలించారు. రెండు ఎకరాల్లో సుమారు రూ.6 కోట్లతో జి+1 భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రవాణా సౌకర్యాలు, నాయకులు, కార్యకర్తల రాకపోకలకు అనుకూలతపై క్షేత్రస్థాయిలో చర్చించారు.