హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు ఎస్సై సోమశేఖర్ కౌన్సెలింగ్

సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో బత్తలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు, పాత నేరస్తులకు ఆదివారం ఎస్సై సోమశేఖర్ కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నేరాలను పునరావృతం చేయకుండా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలతో పాటు కొత్త కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.